కోదాడ పట్టణంలో టిఎస్ పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-3 పరీక్షకు అభ్యర్థుల నుండి స్పందన కరువైంది. తొలి రోజు జరిగిన పేపర్ వన్ జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ పరీక్షకు 3124 మంది హాజరు కాగా, మధ్యాహ్నం జరిగిన పేపర్ 2 హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ పరీక్షకు 3124 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. మొత్తం మీద 41 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. హాజరు కంటే గైర్హాజరు ఎక్కువగా ఉండడం గమనార్హం.