అధిక బరువు ఉన్న వారిలో గురక సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజు కాస్త అల్లాన్ని ఏదో ఒక రకంగా తీసుకుంటే గురక తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి తింటే గురక సమస్య తగ్గుతుంది. అర టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగడం వల్ల గురక తగ్గుతుంది. పుదీనా నూనెను కానీ, గోరువెచ్చని నీటిలో పుదీనా ఆకులను కానీ వేసుకొని తీసుకోవచ్చు.