20వ తేదీన వేములవాడ రాజన్న సన్నిధికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో శ్రీరాజరాజేశ్వర ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పి శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, ఈవో కె. వినోద్ రెడ్డిలతో కలిసి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులను ఎక్కడి నుంచి వచ్చారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.