బాలికల సమగ్ర అభివృద్ధికై గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం అన్నారు. గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్స్ ఏర్పాటుపై అధికారులతో సిరిసిల్ల కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పాఠశాలలో హెడ్మాస్టర్, ఛైర్పర్సన్, గర్ల్ చైల్డ్ ఫ్రెండ్ టీచర్ కన్వీనర్‌గా, యాక్టివ్ గా ఉండే ఇద్దరు బాలికలు, మహిళా కానిస్టేబుల్ తో క్లబ్ ఏర్పాటు చేయాలన్నారు.