మండపాలకు అనుమతులు తప్పనిసరి: పోలీస్ కమిషనర్

69பார்த்தது
మండపాలకు అనుమతులు తప్పనిసరి: పోలీస్ కమిషనర్
గణేశ్ నవరాత్రి ఉత్సవాలలో మండపాలకు అనుమతులు తప్పనిసరని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లిలో శుక్రవారం పర్యటించిన సీపీ నిమజ్జనోత్సవాలు జరిగే మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించారు. వాహనాల రూట్ ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటుపై మున్సిపల్ కమిషనర్, పోలీస్ అధికారులతో చర్చించారు. సీపీ వెంట డిసిపి చేతన, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏసిపి జి. కృష్ణ ఉన్నారు.

தொடர்புடைய செய்தி