ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు రావాల్సిన ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ మేనేజ్ మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లెంకి శ్రీనివాస్ కోరారు. గురువారం పెద్దపల్లి బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు, అధ్యాపకులతో కలిసి నల్ల బ్యాడ్జిలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.