రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి, కోమండ్లపల్లి, నీరుకుల్ల, గట్టేపల్లి, కదంబాపూర్, శాస్త్రినగర్, పూసాలలో సోమవారం ఐకెపి, పీఏసీఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.