జిల్లాలో మరో 950 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ జనవరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్ పై అధికారులతో రివ్యూ నిర్వహించారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో డిహెచ్ఎస్ఓ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.