ఇల్లంతకుంట: మిత్రమండలి ప్రమాదకార్ ఆధ్వర్యంలో రూ. 3 లక్షలు నష్ట పరిహారం
గత నెలలో ఇల్లంతకుంట మండలం రేపాకకి చెందిన బోడిగే కిరణ్ మల్లారంలో జరిగిన ప్రమాదంలో చనిపోయారు. తనకు ఇద్దరు పిల్లలు (ఆడబిడ్డలు) ఉన్నారు. పిల్లల భవిష్యత్తు నిమిత్తం మిత్రమండలి ప్రమాదకార్ ఆధ్వర్యంలో రూ. 3 లక్షలు నష్ట పరిహారం రాగా, ఈ నగదును ఆడబిడ్డల పేరుపై బెజ్జంకి పోస్టాఫీస్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారి కుటుంబ సభ్యులకు గురువారం కార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కాత మల్లేశం, రవి, గూడ బాబు ఉన్నారు.