తిమ్మాపూర్: నల్లగొండ లక్ష్మీనరసింహస్వామిని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం ఆలయానికి రాగా ఆలయ కమిటీ ఛైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ శాలువాతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు లక్ష్మణాచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.