గన్నేరువరం మండలానికి రవాణా సౌకర్యం దృష్ట్యా మరియు ఖాసింపేట మానస దేవి ఆలయానికి వచ్చే భక్తులు అధికంగా రావడం వలన భక్తుల దృష్ట్యా బస్సుల సంఖ్య పెంచాలని గన్నేరువరం, మైలారం, ఖాసీంపేట, పారువెల్ల గ్రామాల ప్రజలు కరీంనగర్-1 డిపో మేనేజర్ కు గురువారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందులా ప్రతి రోజూ ఉదయం మరియు సాయంత్రం సమయంలో యథావిధిగా బస్సులను పునరుద్ధరించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.