ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం పీఏసీ ఎన్నిక ఓటింగ్ వేళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఎదురుపడ్డారు. ఈ క్రమంలో పవన్ను బొత్స ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.