జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రం గోధూర్ గ్రామంలో ఫ్యాక్స్ సెంటర్, మెట్పల్లి మండలంలోని ఆత్మా నగర్ గ్రామంలో ఐకెపి సెంటర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బి. సత్య ప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ధాన్యానికి సంబంధించిన తేమను పరిశీలించారు. వారి వెంట మెట్పల్లి ఆర్డిఓ శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, డిఆర్డిఓ రఘు వరణ్ పాల్గొన్నారు.