ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వారిపై రౌడీ షీట్లు తెరవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీసులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డిఎస్పిలు రవీంద్ర కుమార్, రఘు చంధర్, ఉమా మహేశ్వర రావు పాల్గొన్నారు.