జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని హనుమాన్ టెంపుల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా మెట్పల్లి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుని ఆనవాళ్లు గుర్తించిన వారు డీఎస్పీ మెట్పల్లి-8712656803, సీఐ మెట్పల్లి 8712656819, ఎస్సై ఇబ్రహీంపట్నం 8712656795 నెంబర్లకి సమాచారం అందించాలని పోలీసులు కోరారు.