జిల్లాలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఇన్చార్జ్ కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం జగిత్యాల కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో డీఎస్ఓ, డిఎంఓ, రైస్ మిల్లర్లు, జిల్లా అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ బిఎస్ లత, అగ్రికల్చర్ ఆఫీసర్, ట్రాన్స్పోర్ట్, యాజమాన్యం పాల్గొన్నారు.