జగిత్యాల జిల్లాలోని అన్ని డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు 250 మంది ఉద్యోగులతో బుధవారం జిల్లా కేంద్రంలో పాత బస్ స్టాండ్ నుండి కలెక్టర్ ఆఫీసు వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం బకాయిల విడుదల కోరుతూ కలెక్టర్ బి సత్య ప్రసాద్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్ లు, ఉద్యోగులు పాల్గొన్నారు.