బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం టార్గెట్ రాజ్ పాకాల కాదు కేటీఆర్ అని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అన్నారు. కేటీఆర్ ఫామ్ హౌస్ పార్టీకి వస్తారని భావించారన్నారు. ఆయనను ఏదోరకంగా డ్రగ్స్ కేసులో ఇరికించాలనుకున్నారన్నారు. 25 రోజుల క్రితం నాపై కూడా ఇలాంటి కుట్ర చేశారని ఎమ్మెల్యే పాడి తెలిపారు.