తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ భార్య రజిని గుండెనొప్పికి గురయ్యారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచనతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స తీసుకుంటున్నారు. కాగా సాయిచంద్ గత నెల 29న గుండెపోటుతో కన్నుమూశారు.