చికిత్స పొందుతూ 3 నెలల చిన్నారి మృతి

1089பார்த்தது
చికిత్స పొందుతూ 3 నెలల చిన్నారి మృతి
చికిత్స పొందుతూ 3 నెలల చిన్నారి మృతి చెందిన సంఘటన కల్హేర్ మండలం కిష్టాపూర్ లో శుక్రవారం జరిగింది. బేకరీ మంజుల అనిల్ కుమార్తెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నిజమాబాద్ లో చికిత్స అందించాక ఇంటికి తీసుకువచ్చారు. శుక్రవారం జ్వరం రావడంతో గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడు అలీ దగ్గరకు తీసుకువెళ్లారు. వైద్యుని వల్లే తమ కుమార్తె మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు. తాను ఇలాంటి ఇంజక్షన్ ఇవ్వలేదని ఆర్ఎంపీ వైద్యుడు తెలిపారు.

தொடர்புடைய செய்தி