నాయి బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి లోని జనప్రియ హోటల్లో మంగళవారం అలై బలై కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, గౌరవ అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాజారం, కోశాధికారి సత్తయ్య, సలహాదారులు సాయినాథ్ పాల్గొన్నారు.