సంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద చెరువు మల్కాపూర్ పెద్ద చెరువు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువు శనివారం అలుగు పారుతుంది. ఈ చెరువు నీటి ద్వారా పది గ్రామాలకు చెందిన 2500 ఎకరాలలో రెండు పంటలు పండుతాయి. చెరువు నిండి అలుగు పొర్లుతుండటంతో చూసేందుకు ప్రజలు వస్తున్నారు.