సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 32 మంది తమ వినతి పత్రాలు కలెక్టర్ కు అందించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.