పటాన్ చెరు డివిజన్ లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ రూపేష్ సూచించారు. పటాస్ చెరు పోలీస్ స్టేషన్ ను మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇక్కడి పోలీసు అధికారుల పని సంతృప్తికరంగా ఉన్నట్లు చెప్పారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అదనపు ఎస్పీ సంజీవరావు, డిఎస్పి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.