సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం మోస్తారు వర్షం కురిసింది. ఒకవైపు సూర్యకిరణాలు మరోవైపు వర్షం పడడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఒక్కసారిగా వర్షం కురవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.