రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. జహీరాబాద్ పట్టణంలో ఆదివారం పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా కార్యకర్తలు ఇప్పటినుంచే కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.