నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేటలో వైద్య శిబిరం కొనసాగుతుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి సోమవారం ప్రకటనలో తెలిపారు. నీటి సమస్య కారణంగానే గ్రామస్తులకు వాంతులు, విరేచనాలు అయ్యాయని చెప్పారు. 13 మంది గ్రామంలోని వైద్య శిబిరంలో 17 మంది నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.