నారాయణఖేడ్ పట్టణంలో మనూర్ గ్రామానికి చెందిన దిలీప్ రావు కులకర్ణికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 14,000 చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే స్వగృహంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వైద్యం కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.