పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులోకి మళ్ళీ వరద నీరు భారీగా చేరుతుంది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున 6వ గేట్ ఎత్తారు. 1. 5 మీటర్ల ఎత్తు నుంచి 8, 142 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలినట్లు ఇరిగేషన్ ఎఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కోసం జెన్కోకు 2, 854 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు చెప్పారు.