విజయదశమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం జోగిపేట పట్టణానికి చెందిన బిఆర్ఎస్ యువ నాయకులు జిన్నా విజయ్ కుమార్ మూడో వార్డు ప్రజలతో పాటు అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగైన బతుకమ్మ పండుగ తర్వాత వచ్చే సాంప్రదాయక పండగ దసరా అని అన్నారు. ప్రజలందరికీ కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు.