జోగిపేట పట్టణంలో మద్యరంగం వద్ద రుద్ర సేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాల సందర్బంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జోగిపేట 17వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ చిట్టిబాబు దంపతులు రాధిక ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు మహా కుంకుమ అర్చన పూజ నిర్వహించబడుతుంది. కావున భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారి దివ్య ఆశీస్సులతో పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని రుద్రాసేన యూత్ కమిటీ నిర్వాహకులు తెలిపారు.