ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామాభివృద్ధి కొరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల నిధులు మంజూరు చేశారన్నారు. ఈసందర్భంగా మంత్రికి నేరడిగుంట గ్రామ ప్రజల తరుపున మండల మాజీ సీడీసీ డైరెక్టర్ మక్త జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇట్టి నిధులను సీసీ రోడ్స్ కు ఉపయోగించి అభివృద్ధి చేస్తామని తెలిపారు.