బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ఆయన కారును బాంబుతో పేల్చేస్తామంటూ దుండుగుడు హెచ్చరించారు. ఈ మేరకు ముంబయి వర్లీలోని రవాణా శాఖ కార్యాలయానికి ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. సల్మాన్‌ను కాల్చి చంపేస్తామని గతంలోనూ బెదిరింపులు రావడంతో ఆయన ఇంటి వద్ద బుల్లెట్ ఫ్రూఫ్ అద్దాలు అమర్చి హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. తాజాగా మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపింది.