రూ.30 లేక ఆసుపత్రి బయటే నిద్ర.. చలికి తట్టుకోలేక వ్యక్తి మృతి

58பார்த்தது
రూ.30 లేక ఆసుపత్రి బయటే నిద్ర.. చలికి తట్టుకోలేక వ్యక్తి మృతి
మైసూరులో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. చెలువాంబ ఆస్పత్రి డార్మిటరీలో పడుకునేందుకు రూ.30 లేక ఓ వ్యక్తి చలిలో పడుకుని సోమవారం కన్నుమూశాడు. చౌడల్లి గ్రామానికి చెందిన శివగోపాలయ్య(35) భార్య ఇటీవలే ప్రసవించింది. తల్లి బిడ్డ ఇద్దరినీ వైద్యులు ఐసీయూలో ఉంచారు. వైద్యులు ఏ సమయంలోనైనా తనను పిలవొచ్చనే ఉద్దేశంతో శివగోపాలయ్య ఆస్పత్రికి వచ్చాడు. నిరుపేద కావడంతో తినేందుకు, డార్మిటరీలో నిద్రించేందుకు డబ్బుల్లేవు. ఆరు బయట పడుకున్న ఆయన చలిని భరించలేక చనిపోయాడు.

தொடர்புடைய செய்தி