TG: కాంగ్రెస్ ప్రభుత్వం జరపాల్సింది విజయోత్సవాలు కాదని.. అపజయోత్సవాలు జరపాలని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్గా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని కోరారు. పది నెలల్లో రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి తీసుకువెళ్లారని Xవేదికగా ఆరోపించారు.