ఏపీలోని విద్యార్థులకు కూటమి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు చెల్లింపులకుగాను రూ.3.32 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. మైనారిటీలకు స్వయం ఉపాధి రాయితీ రుణాల మంజూరుకుగాను రూ.173 కోట్ల విడుదలకు అనుమతులిచ్చింది. ఇందులో రూ.152 కోట్లు రాయితీ రుణాల మంజూరుకు, శిక్షణ, ఉపాధి కల్పనకు రూ.21 కోట్లు వినియోగించనున్నారు.