రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం లోని గ్రామ యువత అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలని శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ సర్వే ఆధారంగానే రాబోయే రోజుల్లో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందుతాయని అన్నారు.