షాద్ నగర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) గా నూతనంగా బదిలీపై ఇక్కడికి వచ్చిన ఎన్ఆర్ సరిత, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లు మర్యాదపూర్వకంగా శుక్రవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పూల మొక్కను బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సేవలు రెవిన్యూ పరంగా అందించాలని సూచించారు.