షాద్ నగర్ పట్టణంలోని శ్రీ శివ మారుతి అయ్యప్ప గీతా మందిరంలో నిర్మాణం అవుతున్న రాజగోపురం నిర్మాణ పనుల నిమిత్తం పట్టణంలోని శ్రీనివాస మెడికల్ హాల్ నిర్వాహకులు ఆకుల అరుణ, వెంకటేష్ దంపతులు రూ. 13 లక్షలు విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని బుధవారం ఆలయ కమిటీ అధ్యక్షుడు లష్కర్ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి రెటికల్ నందీశ్వర్ లకు అందించారు. దాతలకు ఆలయ కమిటీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.