యావత్ భారత దేశం మొత్తం రైతు పై ఆధార పడిందని, అలాంటి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పరిధిలోని చిలకమర్రి శివారులో
సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ వర్షాల కారణంగా పత్తి సాగు కాస్త ఇబ్బందికరంగా మారిందన్నారు.