తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారుల పైకి తుపాకులను గురిపెట్టిన నాయకులు నేడు తెలంగాణ ప్రజల అస్తిత్వం, తెలంగాణ బహుజనుల గురించి మాట్లాడడం వారికే చెల్లిందని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలో ఉన్న తెలంగాణ తల్లి చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేసిన అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.