వ్యవసాయ రంగంలోకి పురుగుమందుల పిచికారీ కోసం ప్రవేశించిన డ్రోన్ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తున్నది. గతేడాది జిల్లాలో ఈ డ్రోన్లు ఒకరిద్దరు రైతుల వద్దే ఉండగా ఇప్పుడు కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు డ్రోన్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గురువారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో అనేక గ్రామాల్లో రైతులు మక్క ఇతర పంటల్లో డ్రోన్ల సహాయంతో పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు.