గతంలో పాలించిన నాయకులు తమస్వార్ధ రాజకీయాల కోసం అభివృద్ధినిపూర్తిగా అడ్డుకున్నారని, కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని ఎలాంటి వివక్షకు తావు లేకుండా ప్రజలకు సుస్థిరమైన పాలన అందిస్తూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నామని షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ అన్నారు. సోమవారం జానమ్మ చెరువు అభివృద్ధిలో భాగంగా మినీ ట్యాంక్ బండ్ గా మార్చేందుకు రెండు కోట్ల రూపాయలతో చేపట్టబోయే పనులకు శంకుస్థాపన చేశారు.