రంగారెడ్డి: మాడ్గుల మండలం గుడితండాకు చెందిన రాత్లావత్ సురేశ్ (28) అనే యువకుడు తన తండ్రి,
సోదరుడి చేతిలో హత్యకు గురైన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 11వ తేదీన దసరా పండుగకు తండాకు వచ్చాడు. దసరా వేడుకల అనంతరం 13వ తేదీ రాత్రి కుటుంబసభ్యుల మధ్య తలెత్తిన గొడవ కారణంగా తండ్రి లక్ష్మణ్, సోదరుడు నరేశ్ లు కలిసి సురేష్ నిద్రిస్తున్న సమయంలో కత్తితో పొడిచి హత్య చేశారు. ఆ తరువాత పొలంలో పాతి పెట్టారు.