షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హెచ్ఆర్డీసీఎల్ ద్వారా మంజూరైన బీటి రోడ్డు పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. కొత్తూరు మున్సిపాలిటీలో 18 కోట్ల అంచనా వ్యయంతో, కొత్తూరు వై జంక్షన్ చౌరస్తా నుండి వినాయక స్టీల్స్ వరకు (1. 5 కిలోమీటర్లు) బీటి రోడ్డు నిర్మాణం చేపట్టారు. అంతేకాక, కొత్తూరు రైల్వే క్రాసింగ్ నుండి కుమ్మరి గూడ జంక్షన్ వరకు 32 కోట్ల వ్యయంతో 2. 60 కిలోమీటర్ల బీటి రోడ్డు పనులను ప్రారంభించారు.