రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే చేపడుతున్న మహా కార్యక్రమానికి దాతలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం పట్టణానికి చెందిన వైద్య దంత హాస్పిటల్ యజమాని డాక్టర్ రంజిత గిరి దంపతులు ఐదు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా అందజేశారు.