దీపావళి పండుగను పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణ మున్సిపాలిటీ పరిశుద్ధ కార్మికులకు శనివారం ఉచితంగా సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తోపాటు మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ హాజరయ్యారు. 25 వ వార్డు మహిళా కౌన్సిలర్ గడ్డం మాధురి నందకిషోర్ దంపతులు ముఖ్య అతిధుల చేతిలో మీదుగా పరిశుద్ధ కార్మికులకు 25 కేజీల బియ్యం, వస్త్ర దానం చేశారు.