గాంధీ కుటుంబం హామీ ఇస్తే అది 100 శాతం నెరవేరుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో బుధవారం నిర్వహించిన కుల గణనపై అవగాహన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. "తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ కూడా ప్రజలకు మాటిచ్చారు అన్నారు.