బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ట్వీట్ చేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కాపాడేందుకు బండి సంజయ్ తాపత్రయ పడుతున్నారని, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా? లేక బీజేపీ అనుబంధ ప్రభుత్వమా? అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.