మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం బూతు పురాణం కుటుంబమని.. ఉదయం లేస్తే చాలు ఆ పార్టీ నేతలు అందరూ బూతులే మాట్లాడుతారన్నారు. వాళ్లు చేస్తే సంసారం మిగిలిన వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు మాట్లాడతారంటూ మండిపడ్డారు. కేసీఆర్ తిట్టినట్లు బూతులు ఎవరు తిట్టలేదని, తండ్రి లాగే కొడుకు కేటీఆర్ ప్రవర్తిస్తున్నారని అన్నారు.